ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా మే 7న పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌటయ్యాడు. ఇలా.. లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అయితే.. అనంతరం. 177 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ జట్టు.. మోహిసిన్ ఖాన్ వేసిన తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. నాలుగో ఓవర్‌లో కేకేఆర్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6).. 3.4వ ఓవర్‌లో పెవిలియన్‌కు చేరాడు. వరుస వికెట్లను చేజార్చుకున్న కేకేఆర్ 85 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది.
జేసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో కేకేఆర్ చివరి మూడు వికెట్లు కోల్పోయి ఓటమిని పరిపూర్ణం చేసుకుంది. తొలుత సునీల్ నరైన్ (22) కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటవగా, ఆమరుసటి బంతికే సౌథీ (0) ఆవేశ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. మూడో బంతికి హర్షిత్ రాణా (1) రనౌటవ్వడంతో కేకేఆర్ ఇన్నింగ్ప్ 101 పరుగుల వద్ద ముగిసింది. ఫలితంగా లక్నో 75 పరుగుల భారీ తేడాతో కేకేఆర్‌పై ఘన విజయం సాధించింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రసెల్ (45), నరైన్ (22), ఫించ్ (14) రెండంకెల స్కోర్ చేయగా.. లక్నో బౌలర్లలో హోల్డర్, ఆవేశ్ ఖాన్ చెరో మూడు వికెట్లు .. చమీరా, మోహిసిన్ ఖాన్, బిష్ణోయ్ తలో వికెట్ దక్కించుకున్నారు.