శ‌రీరాన్ని ఇస్త్రీ చేసే డివైస్‌.. కొవ్వు క‌రుగుతుంది.. ధ‌ర ఎంతంటే..?

-

శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును సుల‌భంగా క‌రిగించుకోవాల‌ని చూస్తున్నారా ? స‌న్న‌గా మారాల‌ని అనుకుంటున్నారా ? శ‌రీరంపై సాగిపోయిన చ‌ర్మం, స్ట్రెచ్ మార్క్స్‌, ఇత‌ర మ‌చ్చ‌లు ఉన్నాయా ? అయితే వీట‌న్నింటికీ ఒకే ప‌రిష్కారం.. లూమినా ఫ్యాట్ ఐర‌న్ డివైస్‌. దీని స‌హాయంతో ముందు తెలిపిన ఆయా స‌మ‌స్య‌ల నుంచి చాలా తేలిగ్గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ నూత‌న త‌ర‌హా డివైస్‌కు అమెరికా ఎఫ్‌డీఏ కూడా ఆమోద‌ముద్ర వేసింది. ప్ర‌స్తుతం క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్‌లో భాగంగా దీన్ని కేవ‌లం 199 డాల‌ర్ల‌కే పొంద‌వ‌చ్చు. Indiegogo అనే వెబ్‌సైట్‌లో ఈ డివైస్ అందుబాటులో ఉంది.

పేరుకు త‌గిన‌ట్లే ఫ్యాట్ ఐర‌న్ డివైస్ చ‌ర్మం కింది భాగంలో పేరుకుపోయిన‌, ఎంత‌కూ క‌ర‌గ‌ని మొండి కొవ్వును అయినా స‌రే ఇట్టే క‌రిగిస్తుంది. దుస్తులు ముడ‌త‌లుగా ఉంటే స‌హ‌జంగానే మ‌నం ఐర‌న్ బాక్స్‌తో ఆ ముడ‌త‌ల‌ను తొల‌గిస్తాం. స‌రిగ్గా అదే కాన్సెప్ట్‌లో ఈ ఫ్యాట్ ఐర‌న్ డివైస్‌ను త‌యారు చేశారు. దీన్ని శ‌రీరంపై ఇస్త్రీ చేసిన‌ట్లు ఉప‌యోగించాలి. దీంతో చ‌ర్మం కింది భాగంలో ఉండే మొండి కొవ్వు క‌రుగుతుంది. అలాగే చ‌ర్మంపై ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్‌, మ‌చ్చ‌ల‌ను తొల‌గిస్తుంది. ముడ‌త‌లను త‌గ్గిస్తుంది. కండ‌రాల‌ను దృఢంగా చేయ‌డంతోపాటు వాటికి చ‌క్క‌ని ఆకృతి వ‌చ్చేలా చేస్తుంది. సాధార‌ణంగా స్త్రీల‌కు పిరుదులు, తొడ‌ల వ‌ల్ల‌, పురుషుల‌కు పొట్ట భాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోతుంది. ఆయా భాగాల్లో నిత్యం ఈ డివైస్‌తో మ‌ర్ద‌నా చేయ‌డంద్వారా అక్క‌డ పేరుకుపోయిన మొండి కొవ్వు కూడా సుల‌భంగా క‌రిగిపోతుంది.

ఫ్యాట్ ఐర‌న్ ప‌రిక‌రాన్ని నిత్యం 15 నిమిషాల పాటు వాడితే చాలు.. పైన తెలిపిన లాభాలు క‌లుగుతాయి. దీని నుంచి వెలువడే హీట్ చ‌ర్మం కింది భాగంలో ఉండే కొవ్వును క‌రిగిస్తుంది. మ‌చ్చ‌లు, స్ట్రెచ్ మార్క్స్‌ను పోగొట్ట‌డంతోపాటు సాగిన‌ చ‌ర్మాన్ని తిరిగి పూర్వ స్థితికి తీసుకువ‌స్తుంది. సాధార‌ణంగా బ‌రువు త‌గ్గించే అనేక వెయిట్ రిడ‌క్ష‌న్ క్లినిక్‌ల‌లో పెద్ద పెద్ద ప‌రిక‌రాల‌ను వైర్ల‌తో వాడుతారు. అయితే ఫ్యాట్ ఐర‌న్ కూడా స‌రిగ్గా ఆయా ప‌రిక‌రాల త‌ర‌హాలోనే ప‌నిచేస్తుంది. కాక‌పోతే అవి భారీ సైజులో ఉంటాయి, ఇది చిన్న‌గా ఉంటుంది.. అంతే తేడా. పైగా దీన్ని ఎక్క‌డికంటే అక్క‌డికి సులభంగా తీసుకెళ్ల‌వ‌చ్చు. సుల‌భంగా వాడ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో స‌ద‌రు యంత్రాలు ఇచ్చిన ఫ‌లితాల‌నే ఈ ఫ్యాట్ ఐర‌న్ పరిక‌రం కూడా ఇస్తుంది.

అయితే ప్ర‌స్తుతం ఈ డివైస్ అమెరికాలో మాత్ర‌మే ల‌భిస్తోంది. కానీ దీనికి అవ‌స‌రం అయ్యే చార్జిలు చెల్లించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎవ‌రైనా దీన్ని తెప్పించుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో 1 ఫ్యాట్ ఐర‌న్ డివైస్, 3 ఇన్ 1 ఐ మ‌సాజ్ వ్యాండ్‌, ఎస్‌ప్రెస్సో షాట్ ఇన్‌స్టంట్ లిఫ్టింగ్‌, ట్రిపుల్ ఐ సీరం అనే ప్యాక్‌లు క‌లిగిన ఒక బండిల్‌ను 349 అమెరిక‌న్ డాల‌ర్లు చెల్లించి ఎవ‌రైనా ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. ఆగ‌స్టు 2020 వ‌ర‌కే ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉండ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version