మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ప్రభాస్ సినిమా ..?

-

రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తోంది. మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించబో సినిమా ఇదే కావడంతో అందరిలోను ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తారన్న వార్తలు వచ్చాయి. కాని తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఇంటర్నేషనల్ సినిమా గా రూపొందించేదుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

 

అంతేకాదు ఈ సినిమాని మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంగా తెరకెక్కించేందుకు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తున్నారట. ఈ భారీ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె నటించబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు కొన్ని కీలక పాత్రల కోసం హాలీవుడ్ అండ్ బాలీవుడ్ నటులను నాగ్ అశ్విన్ ఎంచుకునేందుకు ప్లాన్స్ వేస్తున్నారట. అంతేకాదు 400 కోట్లకి పైగా బడ్జెట్ ని కేటాయించిన ఈ సినిమాకి భారీ సెట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మిస్తున్నారట. ఇక ఈ సినిమా వైజయంతి మూవీస్ కి 50 వ సినిమా కావడం విశేషం.

 

ఇక ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేం రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే సగ భాగం చిత్రీకరణ పూర్తవగా మిగతా చిత్రీకరణ త్వరలో మొదలవబోతుందట. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్ లో ఈ సినిమా చిత్రీకరణ జరపబోతున్నారని తెలుస్తుంది. ఇక బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ కి సిస్టర్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ భాగ్యశ్రీ ల మీద కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేశారట. 2021 సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version