నేడు ఆకాశంలో అధ్భుతం చోటు చేసుకోనుంది. దాదాపు 580 సంవత్సరాల తర్వాత ఇవాళ సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది గ్రహనాల్లో చివరిది ఇది. శుక్రవారం ఉదయం ప్రారంభం కానున్న చంద్ర గ్రహనం సుమారు ఆరు గంటల వరకు కొనసాగనుంది. భారత్ లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం పరిసర ప్రాంతాల్లో మాత్రమే గ్రహనం కనిపించనుంది. మిగిలిన ప్రాంతాల్లో కొన్ని సేపు మాత్రమే గ్రహనం కనిపించనుంది. పూర్తి గ్రహనం మధ్యాహ్నం 2.32 గంటలకు ఏర్పడి, సాయంత్రం 5.30 గంటలకు గ్రహనం ముగియనుంది. ఆరు గంటల పాటు కొనసాగే ఇలాంటి సుదీర్ఘ చంద్ర గ్రహనం గతంలో 1440లో ఏర్పడింది. మళ్లీ 2489 అక్టోబర్ 9న ఏర్పడనుంది.
అమెరికా తూర్పు తీరంలో ఈ అద్భుతాన్ని తెల్లవారుజామున 2 నుండి 4 గంటల వరకూ చూడొచ్చు. పశ్చిమ తీరంలో ఉన్నవారు రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశముందని నాసా ప్రకటించింది. ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలకు ఈ పాక్షిక చంద్ర గ్రహణం దర్శనమివ్వబోతోంది. ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని ఉత్తర అమెరికా ఖండంలో 50 దేశాల వారు వీక్షించే వీలుంది. దక్షిణ అమెరికా ఖండం మెక్సికోలో కనిపించబోతుంది. ఈ సమయంలో చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తుంది.