’మా‘ లో తగ్గని వేడి.. సాయంత్రం ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్..

-

’ మా ‘ ఎన్నికలు ముగిసినా… ఎన్నికల్లో రగిలిన మంట మాత్రం చల్లారడం లేదు. కౌంటర్లు, సెటైర్లు, పరోక్ష వ్యాఖ్యలతో కథ రక్తికట్టిస్తున్నారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మోహన్ బాబు.. అసమర్థున్ని కాదు, వేదిక దొరికిందని ఏదిపడితే అది మాట్లాడటం మంచిది కాదు.. అని కొందరిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మంచు విష్ణు, చిరంజీవి తనను సైడ్ అయిపొమ్మారని సంచలన వ్యాఖ్యలు చేయడం చూశాము. తాజా మరోసారి ’మా‘లో రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు సాయంత్రం ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టబోతోంది. దీంతోమంచు వి ష్ణు ప్యానెల్ పై ఎలాంటి మాటలు తూటాలు పేలబోతున్నాయో అని ప్రజలు ఉత్కంఠగా చూస్తున్నారు. మా ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రకాష్ రాజ్, నాగబాబులు ’మా‘కు రాజీనామా చేశారు. అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మా అధ్యక్షుడి హోదాలో వారి రాజీనామాలను ఆమోదించబోనని విష్ణు స్పష్టం చేశారు. తాజాగా నేడు జరిగే ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ రాజీనామాతో పాటు, మంచు విష్ణు ప్యానెల్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారో… చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version