ముగింపు ద‌శ‌కు మేడారం జాతర‌.. నేడు అమ్మ‌వార్ల‌ వ‌న ప్ర‌వేశం

-

ఆసియాలోనే రెండో అతి పెద్ద జాత‌ర మేడారం మ‌హా జాత‌ర ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈ మినీ కుంభ‌మేళా బుధ వారం అంగ‌రంగ వైభవంగా ప్రారంభం అయింది. బుధ వారం సార‌ల‌మ్మ‌, ప‌గిడిద్ద రాజు, గోవింద రాజు గ‌ద్దె కు చేరుకోవ‌డంతో ఈ మ‌హా జాత‌ర ప్రారంభం అయింది. గురు వారం సామ్మ‌క్క గద్దె పై కొలువు దీరింది. గురు వారం.. సమ్మ‌క – సార‌ల‌మ్మ భక్తుల‌కు ద‌ర్శనం ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హా జాత‌రను చూడటానికి దాదాపు కోటి మందికి పైగా వ‌చ్చార‌ని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌క‌టించారు.

తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప్ర‌క్క రాష్ట్రాల్లో నుంచి కూడా భ‌క్తులు భారీగా త‌ర‌లించారు. ప‌లువురు ప్ర‌ముఖులు కూడా స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్నారు. శుక్ర వారం మేడారంలో భక్తులు కిక్కిరిసిపోయారు. కాగ ఈ రోజు స‌మ్మ‌క – సార‌ల‌మ్మ తిరిగి వ‌న ప్ర‌వేశం చేయ‌నున్నారు. దీంతో ఈ జాతర ముగుస్తుంది. ఈ రోజు సాయంత్రం అమ్మ‌వార్లు వ‌న ప్ర‌వేశం చేయ‌నున్నారు.

కాగ ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాలకు ఒక్క సారి.. అమ్మ‌వార్ల‌ను తీసుకువ‌చ్చి.. గ‌ద్దెల‌పై ప్ర‌తిష్టించి.. నాలుగో రోజు తిరిగి వ‌న ప్ర‌వేశం చేయిస్తారు. ఈ ఆదివాసి సంప్ర‌దాయం చాలా ఏళ్ల నుంచి వ‌స్తుంది. కాగ నేడు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై సౌంద‌ర రాజ‌న్ తో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version