సీఆర్పీఎఫ్ భద్రత ఉన్న నేత కు ఇలాగేనా మీరు ఇచ్చే సెక్యూరిటీ : మధు యాష్కీ

-

సెప్టెంబర్ 23 నుంచే నవంబర్ 7 వరకు తెలంగాణ లో జరుగుతున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర లో కేసీఆర్ ప్రభుత్వ భద్రత వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని ఇది కుట్ర పూరితంగా చేస్తున్నట్టు స్పష్టంగా అర్థం అవుతున్నదని, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ విమర్శించారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఆర్పీఎఫ్ భద్రత ఉన్న ఒక నేతకు రాష్ట్రంలో ఇలాగేనా మీరు భద్రత కల్పించేది అని ఆయన ప్రశ్నించారు. మహబూబ్ నగర్ లో కూడా రాత్రి వేళల్లో రహదారి పై యాత్ర సాగుతున్నప్పుడు వీధి దీపాలు ఆపేసారని, నిన్న హైదరాబాద్ లో అలాగే చేసారని, ఒక్క నిమిషం కూడా కరెంట్ పోదు అని గొప్పలు చెప్పిన కేసీఆర్ రాహుల్ యాత్రలో ఎలా లైట్లు పోయాయో చెప్పాలని అన్నారు. అలాగే మహబూబ్ నగర్ లో భద్రత వలయాన్ని దాటుకుని వచ్చి ఒక వ్యక్తి వచ్చి రాహుల్ గాంధీ కాళ్ళు పెట్టుకున్నారని ఇంత వైఫల్యం ఉంటుందా అని ప్రశ్నించారు. నిన్న సమస్యాత్మక చార్మినార్, పాత బస్తీలో పోలీసులు కనీస భద్రత కల్పించలేదని విమర్శించారు.

పోలీసుల అత్యుత్సాహం, నిర్లక్ష్య ధోరణి వల్ల అనేక మంది ముఖ్య నాయకులు ఇబ్బందులు పడ్డారని, ముఖ్య నాయకులు వివిఐపి పాసులన్నప్పటికి లోనికి అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడంతో ఏఐసీసీ నాయకులు తొక్కిసలాటలో కిందపడి గాయలపాలయ్యారని అన్నారు. ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, మహారాష్ట్ర మాజీ మంత్రి నితిన్ రావత్, ఇంకా చాలా మంది నాయకులు కింద పడ్డారని అన్నారు. డీజీపీ, పోలీసు కమిషనర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని అధికారం ఎప్పటికి ఒకరి సొత్తు కాదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version