శృంగారం అనేది ప్రకృతి చర్య..ఆలు,మగల మధ్య దూరాన్ని తగ్గించాలి, ప్రేమను పెంచాలి అనుకుంటే మాత్రం డైలీ శృంగారం తప్పనిసరి అంటున్నారు సెక్స్ నిపుణులు.. ఈ విషయం పై చాలా చర్చలు వినిపిస్తున్నాయి. డైలీ శృంగారం చెయ్యడం వల్ల బరువు తగ్గుతారా.. అయితే ఎలా చేస్తే బరువు తగ్గుతారు..ఎన్ని సార్లు చెయ్యాలి? అనే సందేహం రావడం అందరికి సహజం.. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని నిపుణులు అంటున్నారు.. 24 నిమిషాల పాటు చేసే సెక్స్ వల్ల పురుషుడు నిమిషానికి 4.25 కేలరీలు కోల్పోతాడని సిద్ధాంత్ భార్గవ అనే వైద్యుడు చెబుతున్నారు. అదే ఆడవాళ్లు అయితే 3.1 కేలరీలు కరుగుతాయి. ఆ 24 నిమిషాల సెక్స్ లో.. 60 నుండి 100 కేలరీల వరకు బర్న్ చేస్తారు.
100 కేలరీలను కరిగించడం తక్కువేం కాదు. సెక్స్ సమయంలో మనం కోల్పోయే కేలరీల పరిమాణం ఎంతసేపు సెక్స్ చేస్తున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ సేపు సెక్స్ చేయగలిగితే అంత ఎక్కువ కేలరీల ను కరిగించుకోవచ్చు. దాదాపు 300-400 కేలరీలు బర్న్ చేయాలి. ముఖ్యంగా, మీరు రోజుకు 4 సార్లు కంటే ఎక్కువ సెక్స్ చేయవలసి ఉంటుంది.
అయితే రోజూ 4 సార్లు ఎక్కువ సేపు సెక్స్ చేయడం దాదాపు అసాధ్యం. సెక్స్ మిమ్మల్ని నాజూగ్గా కనబడేలా చేస్తుందని, లేదా బరువు తగ్గడం లో మీకు సహాయపడుతుందని అనుకోవడంలో ఎలాంటి ఉపయోగం ఉండదు. కేవలం మనిషి అలసి పోతారని మాత్రమే గుర్తుంచుకోవాలి.. ఇది మీ కేలరీ బర్న్ స్కోర్‌ను జోడించవచ్చు కానీ బరువు తగ్గడానికి, వివిధ రకాల వ్యాయామాలను ఆశ్రయించాల్సిందే.. ఆ వ్యాయామాల గురించి మరో రోజు తెలుసుకుందాం…