Madhura Wines Review: కిక్కెంచని “మ‌ధుర వైన్స్”..

-

Madhura Wines Review: ‘మధుర వైన్స్’ .. చాలా క్యాచీ టైటిల్.. మ‌రీ ముఖ్యంగా యూత్ ని చాలా ఆట్రాక్టివ్ చేసింది. టీజ‌ర్, ట్రైల‌ర్ లు కూడా చాలా ప్రామిసింగ్ గా ఉంట‌డంతో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. ఇవి సినిమా పై హైప్ ని క్రియేట్ చేశాయి. నిజానికి 2018 చివర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.. ప‌లు అవాంతరాలు రావ‌డంతో పోస్ట్ పోన్ అవుతూ వ‌స్తూ.. ఎట్టకేలకు ఇవాళ‌( అక్టోబ‌ర్ 22న ) రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం రండి..

కథ : అజయ్ (సన్నీ నవీన్) మధురను ప్రేమిస్తాడు. కానీ, అయితే ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. దాంతో ఆమె ప్రేమ మత్తులో పడి మద్యానికి బానిసైపోతాడు. అతని తండ్రికి వినికిడి సమస్యతో పాటు మాటలు కూడా రాకపోవడంతో అజయ్ ను పట్టించుకునే వాళ్ళే ఉండరు. ఈ క్రమంలో ఇతనికి మధుర వైన్స్… ఓనర్ ఆనంద్ రావు(సమ్మోహిత్ తూములూరి) తో పరిచయం ఏర్పడుతుంది. అనంతరం ఇద్దరూ సన్నిహితులు అవుతారు. మరోపక్క అంజలి (సీమా చౌదరి) అనే అమ్మాయి.. ప‌రిచ‌యమ‌తుంది.

అంజలికి తాగుబోతులంటే నచ్చకపోయినా అజయ్ నిజాయితీ నచ్చి అతన్ని ప్రేమిస్తుంది. అతను కూడా ఆమెను ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రేమ అంజలి అన్నయ్య (సమ్మోహిత్) కు ఇష్టం ఉండదు. ఒక తాగుబోతుకు తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేయడానికి అతను వ్యతిరేకిస్తాడు. మధురతో అజయ్ లవ్ బ్రేకప్ ఎందుకు జరిగింది? ఇష్టం లేకపోయినా మధుర వైన్స్‌ను ఆనంద రావు ప్రారంభించారు. మద్యం వ్యాపారంపై ఆనంద్ రావుకు ఎందుకు అయిష్టం ఏర్పడింది? మరి ఈ ముగ్గురు మధ్య నడిచిన ఈ మధుర వైన్స్ డ్రామాలో చివరకు వీరి కథ ఎలా ముగిసింది ? అసలు అజయ్ – అంజలి ఒక్కటయ్యారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

ఫస్టాఫ్ : మధురవైన్స్ సినిమా కథను చెప్ప‌డంలోనే నాసిర‌కంగా ఉంది. స్క్రీన్ ప్లే చాలా పేల‌వంగా ఉంది. అస‌లు కథ ఎటు పోతుంది… అనేది అర్థం కానే కాదు. తొలి భాగంలో అజయ్, ఆయన తండ్రి మ‌ధ్య కాస్త ఎమోషనల్ ఎపిసోడ్ క‌నిపిస్తుంది. అక్క‌డ‌క్క‌డ అజయ్, అంజలి మ‌ధ్య రొమాంటిక్ సీన్లు యూత్ ను కొద్దిగా అట్రాక్ట్ చేశాయి. మిగితాయి అంత చెప్పుకోవాల్సినంత‌గా ఏం లేవు. కథలో అంత బ‌లం లేదు.
ల‌వ్ బ్రేక్ అప్.. తాగుబోతుగా మార‌డం.. మ‌ళ్లీ ల‌వ్ లో ప‌డ‌టం..అంత సింక్ లేకుండా ఉంది. కథలో ముందు ఏం జరుగుతుందనే అనేది స‌రిగా లేదు. క‌ధ‌నం సాగే విధంగా అంతా ఆసక్తి లేదు.

సెకండాఫ్ : కథ కాస్త ఎమోషన్స్ సాగుతుంది. సినిమాకు డైలాగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్. కానీ కథ, కథనాలను డైలాగ్స్ డామినేట్ చేయడం చేయడం వల్ల సన్నివేశాల్లో బ్యాలెన్స్ తప్పిందనే ఫీలింగ్ కలుగుతుంది.
డైలాగులు బాగున్న క‌థ స‌రిగా లేక‌పోవ‌డంతో పస లేకుండా పోయింది. చిన్న పాత్ర‌లు బరువైనా.. భారీ డైలాగ్స్ చేప్ప‌డం అంత సెట్ కాలేదు. ఇక సినిమా మొత్తం కూడా మూడు పాత్ర‌ల మ‌ధ్య‌నే సాగుతుంది. అజయ్, ఆనంద రావు, అంజలి మధ్యనే జ‌రుగుతుంది.

నటీనటులు ఫెర్ఫార్మెన్స్: అజయ్‌గా సన్నీ, అంజలిగా సీమ చౌదరీ, ఆనంద రావు‌గా సమ్మోహిత్ వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. అజయ్ పాత్రలో సన్నీ ఒదిగిపోయాడు. మ‌ద్యానికి బానిసైపోయిన వ్య‌క్తిగా చాలా బాగా న‌టించారు. ఎమోష‌న్ సీన్స్ ను కూడా చాలా బాగా పండించారు. అలాగే.. సమ్మోహిత్ తన పాత్ర ద్వారా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. తనదైన శైలిలో హావభావాలు పలికించడమే కాకుండా ఎమోషనల్ డైలాగ్స్‌తో ఆలరించాడు. ఇక సీమ చౌదరీ.. లుక్స్ బాగున్నాయి.కానీ నటనలో ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. గ్లామర్ పరంగా కాస్త ఆకట్టుకొన్నది. సన్నీ, సీమ మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అయ్యింది. ఇక‌ లీలా వెంకటేష్, అల్లు రమేష్, హరీష్ రోషన్ వంటి వారి పాత్రలు ఓకే అనిపిస్తాయి.. కానీ ఎక్కువగా గుర్తుండవు.

సాంకేతికవర్గం పనితీరు: మోహన్ చారి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. లైటింగ్ ఫర్‌ఫెక్ట్‌గా ఉండటంతో సన్నివేశాలు చాలా రిచ్‌గా కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో కార్తీక్ రోగ్రిగ్జ్, జయ్ క్రిష్ అందించిన రీరికార్డింగ్ బాగుంది. దర్శకుడు జయకిషోర్.బి రాసుకున్న కథ మరియు మరియు మాటలు బాగున్నాయి. యూత్ కి మరీ ముఖ్యంగా మందుబాబులకి ఇతను రాసుకున్న డైలాగులు బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే … కార్తిక్, జయ్ క్రిష్ ల సంగీతం ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో వ‌ర ప్ర‌సాద్ పేల‌వం అనే చెప్పాలి. సినిమా నిడివి కాస్త ఎక్కువైంది.

సినిమాటోగ్రఫీ కొంతవరకు ఓకే అయినప్పటికీ.. కొన్ని కొన్ని సీన్లలో మాత్రం షార్ట్ ఫిలిం చూస్తున్నామా? అనే అనుమానాలను రేకెత్తించే విధంగా ఉంది. నిర్మాతలు రాజేశ్ కొండెపు, సృజన్ యరబోలు పాటించిన విలువలు బాగున్నా.. టైటిల్ త‌గ్గ విధంగా క‌థ‌లేక పోవ‌డం మైన‌స్ అని చెప్పాలి.

టైటిల్ మ‌త్తెక్కించేలా ఉన్నా.. క‌థ‌లో అంతా కిక్కు లేదు. తాగుబోతుల మ‌ధ్య థ‌మ్స్అప్ తాగే వాళ్లు కూర్చుంటే.. ఎలా ఉంటుందో.. సరిగ్గా ‘మధుర వైన్స్’ సినిమా కూడా అంతే.

నటీనటులు: సన్నీ నవీన్, సీమా చౌదరీ, సమ్మోహిత్ తూములూరి తదితరులు
కథ, దర్శకత్వం: జయకిషోర్ బీ
నిర్మాతలు: రాజేశ్ కొండెపు, సృజన్ యరబోలు
సహ నిర్మాత: సాయి శ్రీకాంత్ తెరువు
సినిమాటోగ్రాఫర్: మోహన్ చారి
సంగీతం: కార్తీక్ రోగ్రిగ్జ్, జయ్ క్రిష్
ఎడిటర్: వర ప్రసాద్
బ్యానర్: ఆర్ కే సినీ టాకీస్
రిలీజ్ డేట్: 2021-10-22

Read more RELATED
Recommended to you

Exit mobile version