శృంగార సమ్మతి వయసు తగ్గించాలి.. కేంద్రానికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు సూచన

-

శృంగారానికి సమ్మతి తెలిపే వయసును బాలికలకు 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టు గ్వాలియర్‌ ధర్మాసనం అభిప్రాయపడింది. తద్వారా టీనేజ్‌ బాలురను చట్టపరమైన చర్యల నుంచి కాపాడవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 2020లో ఒక బాలికను పదేపదే మానభంగం చేసి, గర్భవతిని చేశాడంటూ ఒక యువకునిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు జూన్‌ 27న కొట్టివేసింది. ఈ సందర్భంగా కేంద్రానికి ఈ సూచన పంపింది.

ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్‌ వల్ల బాలబాలికలకు 14 ఏళ్ల వయసులోనే పెద్దరికం వస్తోందనీ, బాలికలు 14 ఏళ్లకే యవ్వన దశకు చేరుకుంటున్నారని హైకోర్టు న్యాయమూర్తి దీపక్‌ కుమార్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. టీనేజ్​లోనే బాలబాలికలు పరస్పర శారీరక ఆకర్షణలకు లోనవుతున్నారని తెలిపారు. ఇందులో ఇద్దరి తప్పిదం ఉన్నప్పటికీ బాలురు నేరారోపణలను ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిలో రతికి సమ్మతి తెలిపే వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సూచించారు. దీని ద్వారా తప్పు చేయని బాలురకు అన్యాయం జరగకుండా కాపాడవచ్చన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version