హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్. ఈ నెల 9 వరకు MMTS రైళ్లు రద్దు కానున్నాయి. హైదరాబాద్ వారం రోజులపాటు 22MMTS రైళ్ల సేవలు బంద్ కానున్నాయి. ఈనెల 3 నుంచి ఈ నెల 9 వరకు MMTS రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
నిర్వహణ పనుల కోసం రైళ్ల సర్వీస్ లను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ నెల 9 వరకు MMTS రైళ్లు రద్దు కానున్న తరుణంలోనే.. హైదరాబాద్ ప్రయాణికులు ఇతర మార్గలను చూసుకోవాలని కోరింది దక్షిణ మధ్య రైల్వే సంస్థ. ఈ నెల 9 వరకు MMTS రైళ్లు రద్దు కానున్న తరుణంలోనే.. హైదరాబాద్ ప్రయాణికులకు చాలా ఇబ్బందులు కలిగే ఛాన్స్ ఉంది. దీంతో నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తే ఛాన్స్ ఉంది.