యూజర్లకు ట్విట్టర్ బిగ్ షాక్ ఇచ్చింది. వెరిఫై అకౌంట్ ఉన్న యూజర్లు రోజుకు 6వేల పోస్టులు, అన్ వెరిఫైడ్ యూసర్లకు రోజుకు 600 పోస్టులు, కొత్తగా అకౌంట్లు తెరిచిన యూజర్లు రోజుకు 300 పోస్టులు మాత్రమే చూడవచ్చని ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్ చేశారు.
కాగా నిన్న సాయంత్రం నుంచి చాలామంది యూజర్లు ట్విట్టర్ ఓపెన్ కావడం లేదని అనుకోగా… అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. మాస్క్ నిర్ణయం ప్రకారం… ప్రస్తుతం వెరిఫైడ్ యూజర్లు 6000 posts/day, అన్ వెరిఫైడ్ యూజర్లు 600 posts/day, న్యూ అన్ వెరిఫైడ్ యూజర్లు, 300 posts/day మాత్రమే చూడవచ్చు. అయితే త్వరలో రేట్ లిమిట్స్ ను పెంచుతామని…వెరిఫైడ్ యూజర్లకు రోజుకు 8వేలు, అన్ వెరిఫైడ్ 800, న్యూ అన్ వెరిఫైడ్ కు 400 పోస్టులు చూసే అవకాశాన్ని కల్పిస్తామని తాజాగా మస్క్ ట్వీట్ చేశారు.