దూసుకొస్తున్న రైలు పట్టాలపై నుల్చున్న యవతి..కాపాడే ప్రయత్నం చేసిన ఆటో డ్రైవర్..కానీ ఏం జరిగిందంటే..!

-

ఓ పక్క వేగంగా దూసుకొస్తున్న రైలు..అందరు గేట్ పడటంతో గేట్ కు ఇవతలపక్కన ఉన్నారు..సరిగ్గా అదే సమయంలో ఓ యువతి రైలుపట్టాలపే వెళ్లి నుల్చుంది. అది చూసిన ఆటో డ్రైవర్ వెంటనే ఆ యవతని కాపాడే ప్రయత్నం చేశాడు..అప్పుడేం జరిగిందంటే..
women
women

ఇటీవల మధ్యప్రదేశ్ లో ఒక ఆటో డ్రైవర్ యవతి ఆత్మహత్య చేసుకోబోతుంటో తన ప్రాణాలు కాపాడి..మానవత్వాన్ని చాటుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ దగ్గర కాసేపట్లో రైలు రాబోతుండటంతో సిగ్నల్ గేట్ పడింది. గేటు పడ్డ వెంటనే ఆటోలు, కార్లు, బైక్ ఇంకా అన్నీ వాహనాలు, పాదాచారులు అంతా గేటుకు ముందుగా ఆగి ఉన్నారు. ఇంతలో ఆటో పక్కనే నిలబడ్డ ఉన్న ఒక యువతి ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని గేటుకు కొంచెం దూరంలో నిలబడింది.

రైలు వచ్చే సౌండ్ రాగానే ఆ యవతి గేటు దాటి వెళ్లి రైలు పట్టాలపై నిలబడింది. ఇది గమనించిన ఆటో డ్రైవర్ వెంటనే వెళ్లి ఆ అమ్మాయిని పట్టాల నుండి లాక్కొని రావటానికి ప్రయత్నించాడు. ఆ యువతి వినపించుకోకుండా “నేను చనిపోవాలి అనుకుంటున్నా.. వదిలేయండి అని అరిచింది”. ఆటో డ్రైవర్ తన ప్రాణాలకు తెగించి ఓ పక్క దూసుకొస్తున్న రైలు నుంచి ఆ యువతి మాటలను ఏ మాత్రం వినకుండా పక్కకు లాక్కొంచాడు.
అదృష్టవశాత్తు వారిద్దరు పక్కకి వచ్చిన తరువాత రైలు వెళ్ళిపోయింది. ఆ యువతి ఎందుకు నన్ను కాపాడారు.. నేను చనిపోవాలి అనుకుంటున్నాని చెప్పి పాపం బాగా ఏడ్చింది. అక్కడున్న వారందరు ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఉద్యోగం రాకపోవటంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పింది. యవతి ప్రాణాలను కాపాడిన ఆటో డ్రైవర్ మొహ్సిన్‌గా గుర్తించారు.
ఈ వార్తను ప్రముఖ న్యూస్ ఛానెల్ పోస్ట్ చేసిన వీడియో ద్వారా తెగ వైరల్ అవుతుంది, ఈ వీడియోపై అంకిత శర్మ ఐపీఎస్‌ తో పాటు పలువురు ప్రముఖులు స్పందించారు. ఈ రోజుల్లో ఎలాంటి ప్రయోజనం లేకుండా ఎవరూ ఎవరికి సాయం చేయటంలేదు..అలాంటిది ముక్కూ ముఖం తెలియని యువతి కోసం ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడిన ఆటోడ్రైవర్ ను అందరూ అభినందిస్తున్నారు.
జీవితం అంటే సమస్యలతో పోరాటం. వచ్చిన సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ అన్నింటికి చావే పరిష్కారం అనకోకూడదు. కానీ చాలామంది ఎక్జామ్ ఫేయిల్ అయ్యామని, ప్రేమించినవాళ్లు దక్కలేదని, ఉద్యోగం రాలేదని, ఇంట్లో వాళ్లు తిట్టారని ఇలాంటి కారణాలతో ప్రాణాలను తీసుకుంటున్నారు. అసలు సమస్యలు రాకుండా జీవితం సాఫీగా ఉంటే కిక్కే ముంటుంది..వచ్చిన సమస్యలను ఎదుర్కున్నప్పుడే కదా మనలో ఉండే సత్తా ఏంటో తెలిసేది. మంచిగా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల జనాలంతా మంచోళ్లానే కనిపిస్తారు..సమస్యలు వచ్చినప్పుడే కదా కాయిన్ కి రెండో సైడ్ క్యారెక్టర్ తెలిసేది. ఈరోజు ఆ యువతికి చనిపోయే ధైర్యం వచ్చింది కాని సమస్యను ఎదుర్కునే ధైర్యం లేదు. అదృష్టవశాత్తు ఆమె బతికింది..చనిపోయి ఉంటే నిండుజీవితాన్ని కోల్పోయి ఉండేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version