రజనీకాంత్ ఫ్యామిలీకి రూ.10 లక్షల సాయం: కేటీఆర్

-

తెలంగాణ శాసన సభ సమావేశాలు చాలా రవవత్తరంగా కొనసాగుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరియు విపక్షల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. ఇక తాజాగా శాసన మండలి వేదికగా… మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. మున్సిపల్‌ శాఖ నిర్లక్ష్యం వలన మొన్న డ్రైనేజ్ హొల్ లో పడి రజినీకాంత్ చనిపోయారని… వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.

ఇప్పటికే రూ. 5 లక్షలు ఇచ్చామని… ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరినట్టు రజినీకాంత్ కుటుంబానికి మరో రూ 5 లక్షలు ఇస్తామని ప్రకటించారు మంత్రి కేటీఆర్‌.ఇక ఘటన కు బాధ్యులు అయిన ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్ లను సస్పెండ్ చేయడం జరిగిందని… ఈ ఘటన పై ఉన్నత స్థాయి విచారణ చేపడుతున్నామని స్పష్టం చేశారు.

2 సెంటిమిటర్ ల వర్షం పడితేనే తట్టుకునే శక్తి మన వరద కాలువలకు లేదు… వరద కాలువల కొత్తగా నిర్మాణం చేపడుతామన్నారు. ఈ ఏడు ఏండ్ల లో కొంత అక్కడక్కడ నాలా లపై ఆక్రమణలు జరిగాయని తెలిపారు. రైతుల ఆత్మహత్యలు తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణే అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించిందని.. జూట్ మిల్ లు కామారెడ్డి, వరంగల్, సిరిసిల్ల లో ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటన చేశారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version