శిక్షణ పేరుతో కోచింగ్ సెంటర్ల కోట్లాది రూపాయల మాఫియా : మధుయాష్కీ గౌడ్

-

ఎంతో మంది నిరుద్యోగులు తమ తల్లుల పుస్తల తాళ్లను తాకట్టు పెట్టి మరీ, సంవత్సరాల తరబడి నుంచి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యారని, ఇప్పుడు నోటిఫికేషన్లు వాయిదా వేయాలంటే ఎంత వరకు కరెక్ట్..?అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. దుర్మార్గమైన డిమాండ్ ముందుకు తెచ్చి నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షల షెడ్యూలు విడుదల చేసాము. నిరుద్యోగులు స్వేచ్ఛగా పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, కావాలనే కుట్ర చేసి పరీక్షలను ఆపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు అనుమానం ఉన్నదని అన్నారు. ప్రధానంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ట్రైనింగ్ సెంటర్ల స్వార్థం ఉన్నట్లు అర్ధమవుతుందని అన్నారు.శిక్షణ పేరుతో కోచింగ్ సెంటర్ల కోట్లాది రూపాయల మాఫియా నడుస్తుందని మండిపడ్డారు.పరీక్షలు వాయిదాలు వేస్తే, ఫీజుల పేరుతో నిరుద్యోగుల రక్తం తాగుదామని చూస్తున్నారని అన్నారు.సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించి కుట్ర కోణాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ కు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version