స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ మంత్రుల పరిధిలో ఉండే అంశం కాదని ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని కేబినెట్ చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయమని అన్నారు.

సెయిల్‌లో విలీనం ప్రతిపాదనలు పరిశీలనలోఉన్నాయని వాటి మీద కొన్ని హద్దులు, అభ్యంతరాలు ఉన్నాయని ఆయన తెలిపారు. స్టీల్ ప్లాంట్‌లో పరిస్థితులు అవగాహన కోసమే కేంద్ర మంత్రి కుమార స్వామి పర్యటిస్తున్నారని అన్నారు. సెయిల్,NMDC,స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో మంత్రి కుమార స్వామి సమావేశం అవుతారని అన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారం కోసం ఉన్న మార్గాలను పరిశీలన చేస్తామని అన్నారు. ఈ పర్యటనలో అద్భుతాలు ఉండకపోవచ్చని శ్రీనివాస తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version