రీయల్ లైఫ్ అల్లా ఉద్దీన్…మ్యాజిక్ కార్పెట్ తో దుబాయ్ వీధుల్లో తిరుగుతున్న వీడియో వైరల్…!

-

అల్లావుద్దీన్ గురించి తెలియని వాళ్లు ఉండరు. అయితే అచ్చం అల్లాఉద్దీన్ మాదిరి బట్టలు ధరించి ఒక మ్యాజిక్ కార్పెట్ ని ఉపయోగించి దుబాయ్ వీధులన్నీ కూడా తిరుగుతున్నాడు ఒక యూట్యూబర్. చూసిన వాళ్లందరూ కూడా షాక్ అవుతున్నారు. అదేంటి ఒక కథలో పాత్ర లాగ ఈ మనిషి వెళ్తున్నాడు అని చూసిన వాళ్లంతా కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఇక ఇతని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే… అమెరికన్ యూట్యూబర్ ఇతను. ఇతను ఒక ఫ్లయింగ్ మ్యాజిక్ కార్పెట్ ని తయారు చేయించి.. దాని మీద దుబాయ్ వీధులన్నీ కూడా తిరుగుతున్నాడు. అంతేకాకుండా కేవలం నెల మీదే కాకుండా నీళ్ళల్లో కూడా ఆ బోర్డు ని ఉపయోగించుకుని వెళ్తున్నాడు.

ఏదో మనం కార్టూన్ లో చూసి మాదిరి ప్రదేశాలు అన్నిటినీ కూడా చుట్టేసి వస్తున్నాడు .సోషల్ మీడియాలో మ్యాజిక్ కార్పెట్ మీద వెళ్తున్న వీడియోని కూడా పోస్ట్ చేశాడు. చాలా మంది ఆ వీడియోని ఇప్పటికే వీక్షించారు. అయితే అసలు ఆ బోర్డు ఎలా వెళుతోంది..? ఎలా దానిని ఉపయోగించి అన్ని వీధుల్లో వెళ్తున్నాడు అనేది చూస్తే..

ఎలక్ట్రికల్ స్కేట్ బోర్డు ని అతను ఉపయోగిస్తున్నట్లు అతను చెప్పారు. రిమోట్ కంట్రోల్ ఉపయోగించి ఆ బోర్డు ని తీసుకు వెళ్తున్నారు. పీవీసీ పైప్ లాంటిది ఒకటి పెద్ద బోర్డుకి కలిపి అతికించి ఉంది. ఆ పెద్ద బోర్డు ని అతను ఈ ఫాయిల్ బోర్డు అని అన్నారు. అయితే మరి అతను చేసిన ఆ మ్యాజిక్ ని మీరు కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version