“మహా సముద్రం” మూవీ ట్విట్టర్ రివ్యూ ఇదే !

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో గా శర్వానంద్‌ ప్రధాన కథా నాయకుడి గా తెరకెక్కుతున్న సినిమా మహా సముద్రం. ఈ సినిమా ను ఆర్‌ ఎక్స్‌ 100 ఫేం దర్శకుడు అజయ్‌ భూపతి… తెరకెక్కిస్తున్నారు. సిద్ధార్థ్ మరో హీరో గా కనిపిస్తున్న ఈ సినిమాలో అదితీ రావ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఈ సినిమా తో హీరో సిద్ధార్ధ్‌…. తొమ్మిదేళ్ల తర్వాత టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి రామబ్రహ్మం సుంకర్ నిర్మాతగా ఉన్నారు. మహా సముద్రం సినిమా కమర్షియల్‌ అంశాలతో కూడిన ఓ ప్రేమ కథ.

ఇక మహా సముద్రం సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల అయిన పోస్టర్లు, ఫస్ట్‌ లుక్స్‌ మరియు టీజర్‌ & ట్రైలర్‌ లు జనాలను బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు… వీటి కారణంగా మహా సముద్రం సినిమా పై అందరికీ అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇలాంటి భారీ అంచనాల నేపథ్యంలో నే ఇవాళ మహా సముద్రం సినిమా అన్ని థియేటర్ల లో విడుదల అయింది.

అయితే… ఈ సినిమా చూసిన నెటిజన్లు.. ట్విట్టర్‌ లో తెగ కామెంట్స్‌ పెడుతున్నారు. మహా సముద్రం సినిమా ఫస్ట్‌ ఆఫ్‌ చాలా అద్భుతంగా ఉందని.. రివ్యూ ఇచ్చేస్తున్నారు నెటిజన్లు. దర్శకుడు అజయ్‌ భూపతి చెప్పినట్లు గానే చేతన్‌ భరద్వాజ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదరిగొట్టనట్లు చెప్పారు నెటిజన్లు. ఇంటర్వెల్‌ ఫైట్‌ ఎపిసోడ్‌ ఈ సినిమా కు బాగా ప్లస్‌ అయిందని పేర్కొంటున్నారు నెటిజన్లు. అలాగే… ఫస్ట్‌ ఆఫ్‌ డీసెంట్‌ యాక్షన్‌ మరియు రొమాన్స్‌ లు కూడా బాగున్నాయట. అంతేకాదు.. మెయిన్‌ లీడ్‌ నటీ నటుల స్క్రీన్ ప్రెజెన్స్‌ కూడా బాగుందని అభిప్రాయ పడుతున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version