మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరద్ చంద్ర పవార్ మంత్రి సత్యవతి రాథోడ్ ను ఈ రోజు పట్టణంలోని తన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లాలో తన దృష్టికి వచ్చిన అంశాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో శాంతి భద్రతలు పటిష్టంగా నిర్వహించాలని, పేదలకు న్యాయం చేయాలని, ప్రజల నమ్మకం పొందే విధంగా పని చేయాలని మంత్రి సూచించారు.