ఈ రోజు బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియం లో మైసూర్ వారియర్స్ మరియు హుబ్లీ టైగర్స్ జట్ల మధ్యన ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన కరుణ్ నాయర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు, అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన మనీష్ పాండే సేన నిర్ణీత ఓవర్ లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో ఓపెనర్ మహమ్మద్ తాహ 40 బంతుల్లో 7 ఫోర్లు మరియు 4 సిక్సులు సహాయంతో పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో సహాయం చేశాడు. ఇతనికి కెప్టెన్ మనీష్ పాండే (50) మరియు శ్రీజిత్ (38) ల నుండి చక్కని సహకారం లభించింది. ఇక మైసూర్ బౌలర్లలో కార్తీక్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం మైసూర్ వారియర్స్ ముందు 204 పరుగుల టార్గెట్ ఉంది.
మహారాజ ట్రోఫీ 2023: మైసూర్ ముందు భారీ లక్ష్యం … చెలరేగిన తాహా, మనీష్ పాండే !
-