సీఎం కుర్చీలో ఆయన కుమారుడు.. మహారాష్ట్రలో దుమారం

-

సాధారణంగా పంచాయతీల్లో పదవి ఒకరిది పెత్తనమొకరిది ఉంటుంది. అంటే భార్య సర్పంచ్, ఎంపీటీసీగా గెలిస్తే.. పెత్తనం భర్త చేస్తుంటాడు. కొన్ని పంచాయతీల్లో అయితే ఏకంగా సర్పంచ్ కుర్చీలో భర్తలు కూర్చొని పెత్తనం చేస్తుంటారు. ఈ విషయంపై పలు గ్రామాల్లో గొడవలు కూడా జరిగాయి. పంచాయతీల్లోనే ఇలా ఉంటే.. ఇక ఎమ్మెల్సీ, ఎంపీ, ముఖ్యంత్రి సీట్లలో ఎవరైనా కూర్చుంటే ఏం జరుగుతుంది. అంత ఉన్నత పదవుల్లో ఉన్నవారి సీట్లలో వేరే వాళ్లు ఎందుకు కూర్చుంటారు అంటారా..? కానీ అలాంటి ఘటన మహారాష్ట్రలో జరిగింది.

ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే కుర్చీలో ఆయన కుమారుడు, లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్‌ శిందే కూర్చున్నాడు. ఇది స్థానికంగా దుమారం రేపింది. దీనికి సంబంధించిన ఫొటో బయటకు రావడంతో విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి.

‘సూపర్‌ సీఎం’ అంటూ ఎన్సీపీ ఎద్దేవా చేసింది. చిత్రంలో ముఖ్యమంత్రి పీఠంపై శ్రీకాంత్‌ శిందే కూర్చొని ఉండగా.. చుట్టూ అధికారులు ఉన్నారు. కుర్చీ వెనుక ‘మహారాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యమంత్రి’ అని బోర్డు ఉంది. శ్రీకాంత్‌ ఏవో దస్తాల్రు పరిశీలిస్తున్నట్లు అందులో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version