మహారాష్ట్ర ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈనెల 20వ తేదిన మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రతో సరిహద్దులు పంచుకుంటున్న ఉమ్మడి నుంచి కీలక నేతలు అక్కడ రెండు జాతీయ పార్టీల కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇండియా కూటమి( మహా వికాస్ అఘాడీ) తరఫున ప్రచారం చేసేందుకు బయలుదేరి వెళ్లారు.
ఇక ఏపీలో ఎన్డీయే కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన పార్టీల నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.కేంద్రపెద్దల సూచనల మేరకు చంద్రబాబు, పవన్ అక్కడ ప్రచారం చేసేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. తాజాగా గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి డిప్యూటీసీఎం పవన్ ముంబై బయలుదేరి వెళ్లారు.