మహారాష్ట్ర పోల్స్..ఎన్డీయే కూటమి విజయం వెనుక మహిళలు

-

మహారాష్ట్రలో ఎర్లీ ట్రెండ్స్ వచ్చేశాయి. మొత్తం 288 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా.. మహాయుతి (ఎన్డీయే) అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నది. మధ్యాహ్నం 3 గంటలలోపు ఫలితాలు, తదుపరి అధికారం ఎవరు చేపట్టబోయేది తేలిపోనుంది. ఇక మహవికాస్ అఘాడీ కూటమి నేతలు మరోసారి రెండో స్థానానికే పరిమితం అయ్యారు. ప్రస్తుతం ఎన్డీయే 216 స్థానాల్లో లీడ్‌లో ఉండగా.. 59 స్థానాల్లో ఎంవీఏ.. అదర్స్ 13 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు.

అయితే, మహాయుతి కూటమి విజయం వెనుక మహిళలు ఉన్నట్లు తేలింది. వారే వెన్నుదన్నుగా నిలిచారని సమాచారం. ఆడవాళ్లకు ‘లాడ్లీ బెహనా యోజన’ నెలవారీ ఆర్థిక సాయం రూ.2,100కు పెంచుతామని ఎన్డీయే కూటమి ప్రకటించింది. తద్వారా 2 కోట్లకు పైగా మహిళలకు బెనిఫిట్ అందనుంది. బీజేపీ మహిళల ఓట్లను టార్గెట్ చేసేందుకు ఈ స్కీం తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో బీజేపీ ప్లాన్ వర్కౌట్ అయ్యిందని, మరోసారి అధికారం చేపట్టబోతుందని చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news