పదవులు, అధికారం వారికే.. కేటీఆర్‌‌పై మాజీ కార్యకర్త సంచలన వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద గులాబీ పార్టీ మాజీ కార్యకర్త గుండమల్ల రాజేందర్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంత శ్రమించినా కార్యకర్తలకు ఎప్పటికీ ప్రతిఫలం దక్కదని అన్నారు. పదవులు, అధికారం అంతా వాళ్లే అనుభవిస్తారని హాట్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు సెల్ఫీలు మాత్రమే ఇస్తారని, ఏమీ చేయరని ఆరోపించారు.

గతంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను బీఆర్ఎస్ నేతలు లక్షల రూపాయలకు అమ్ముకున్నారని బాంబ్ పేల్చారు. పార్టీ కోసం ఇంత కష్టపడ్డ నేను ఓ సహాయం అడిగితే కూడా వాళ్లు చేయలేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలిపారు.ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుండమల్ల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీల విధివిధానాలపై, అందులోని కొందరు నియంతలపై మండిపడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news