ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవర్ కు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా రెస్పాండ్ అవుతోంది. ఈ విషయంపై మహారాష్ట్ర సీఎం ఏనాధ్ షిండే స్పందించడంతో రాజకీయంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. శరద్ పవార్ కు బెదిరింపులు రావడం వెనుక ఎటువంటి కారణాలు ఉన్నాయన్న కారణంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే శరద్ పవర్ కు ఉన్న భద్రత స్థాయిని మరింతగా పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా ఈ బెదిరింపులకు కారణమైన వారిని పట్టుకుంటామని సీఎం ఏనాధ్ షిండే చెప్పారు.