పాదయాత్రలో ఇచ్చిన హామీలను 99% సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని అన్నారు మంత్రి పేర్ని నాని. సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచారని.. గతంలో ఉద్యోగులు, ఉద్యమం చేయకుండా ఒక పిఆర్సి అయినా అమలు అయ్యిందా..? అని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తానని చంద్రబాబు అన్యాయం చేశారని దుయ్యబట్టారు.
ఉద్యోగులకు ఎంత వీలైతే అంత మంచి చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఏ ఉద్యోగి రోడ్డు ఎక్కకుండానే 12వ పిఆర్సి ని సీఎం జగన్ ప్రకటించారని తెలిపారు. చంద్రబాబు కుమారుడికి భద్రత కరువైందని గవర్నర్ కి ఫిర్యాదు చేశారన్న పేర్ని నాని.. మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రతే కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.