MS Dhoni : కొత్త గెటప్ లో మహేంద్ర సింగ్ ధోని

-

మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేకంగా పరిచయం అక్కర లేని పేరు. బహుశా ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సచిన్ టెండూల్కర్ తరువాత అంతటి పేరు సంపాదించిన వ్యక్తి ఎంఎస్ ధోనీనే. ఇండియన్ క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్ గా, ఆటగాడిగా మిస్టర్ కూల్ పేరు సంపాదించుకున్నారు. అయితే, తాజాగా ధోని కొత్త అవతారంలో అదుర్స్ అనిపిస్తున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ధోని బయట పెద్దగా కనబడలేదు. కేవలం ఐపిఎల్ లో ఉన్నప్పుడు మాత్రమే దర్శనమిస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఐపీఎల్ మొదలవనున్న నేపథ్యంలో ధోని తన ప్రాక్టీసును ప్రారంభించాడు. ఇటీవల ధోని ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా తన ప్రాక్టీస్ ముగించుకొని బయటకు వస్తున్న ధోని తెల్లగడ్డం, నల్ల జుట్టుతో సాల్ట్ అండ్ పెపర్ లుక్ లో అభిమానుల కంటపడ్డాడు. ధోని ఇలా కొత్తగా కనిపించడం చాలా మందిని ఆకర్షించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version