హ్యాపీ ఫాదర్స్ డే : కృష్ణకి మహేష్.. మహేష్ కి సితార‌, గౌత‌మ్‌లు..!

-

నేడు ఫాథర్స్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు తమ ఫాథర్స్ ని, వారి ఔన్నత్యాన్ని, వారితో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఎమోషనల్ పోస్ట్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కూడా సోషల్ మీడియాలో తన తండ్రి కృష్ణకి ఫాథర్స్ డే విషెష్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న తండ్రి‌తో దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ‘దృఢ‌మైన‌, ద‌య‌, ప్రేమ‌, సున్నిత‌మైన‌ శ్ర‌ద్ధ ఇలాంటి కొన్ని ప‌దాల‌తో నా తండ్రితో నాకున్న సంబంధాన్ని తెలియ‌జేస్తుంది. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కార‌ణం నాన్న‌. నాన్న‌లా నేను నా పిల్ల‌ల ద‌గ్గ‌ర ఉండ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాను. హ్యాపీ ఫాద‌ర్స్ డే నాన్న’ అని మ‌హేష్ ట్వీట్ చేసారు.

మ‌రోవైపు సితార‌, గౌత‌మ్‌లు కూడా త‌న తండ్రికి విషెస్ అందించారు. మా నాన్న మాకు ఎప్పుడు స్పెష‌ల్. మేం ఏం చేసిన ఆయ‌న‌కి న‌చ్చుతుంది. లాక్‌డౌన్‌లో ఆయ‌న‌తో మేం స‌ర‌దాగా గ‌డిపాం అని చెప్పుకొచ్చారు మ‌హేష్ పిల్ల‌లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version