అల్లు అర్జున్ కి డబుల్ విషెస్..! ఫాదర్స్ డే.. మదర్స్ డే శుభాకాంక్షలు..?

-

ప్రపంచ వ్యాప్తంగా నేడు ఫాదర్స్ డే.. అందరూ ఫాదర్స్ డే సంబరాలు జరుపుకుంటుంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఇవాళ ఫాదర్స్ డే తో పాటు మదర్స్ డే కూడా జరుపుకుంటున్నాడు. అదేంటి బన్నీ కన్ ఫ్యూజ్ అయ్యాడా..? ఇవాళ పేరెంట్స్ డే కాదు కదా అని ఆశ్చర్యపోతున్నారా..? కానీ బన్నీ మాత్రం చాలా క్లారీటీగా ఉన్నాడు. ఈ ఒక్కరోజే రెండు ఉత్సవాలు జరుపుకుంటున్నాడు.

ఇక అసలు విషయానికొస్తే ఇవాళ అల్లు అర్జున్ తల్లి పుట్టినరోజు దాంతో అల్లుఅర్జున్ ఫాదర్స్ డే జరుపుకుంటూనే మదర్స్ డే కూడా జరుపుకుంటున్నాడు. ఫాదర్స్ డే సంబరాలతో పాటే తన తల్లి పుట్టినరోజుని కూడా ఘనంగా జరుపుకుంటున్నాడు. ఈమేరకు తన తల్లితో దిగిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతల్లో పోస్ట్ చేస్తూ తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. బన్నీకి ఫాదర్స్ డే విషెస్ చెబుతూనే తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది మనలోకం. ఇక ప్రస్తుతం అల్లుఅర్జున్ తన 20 వ సినిమాని డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు ఈ సినిమాకి శేషాచలం అనే టైటిల్ ను ఖరారు చేయాలని చూస్తుంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో బన్నీ కి సరసన రష్మిక మందన్నను కథానాయికగా ఎంచుకునట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా నేపద్యంలో షూటింగ్ కి కొంత బ్రేక్ పడింది. కరోన అనంతరం తిరిగి షూటింగ్ కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version