టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కృష్ణ గారి అబ్బాయిగా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్ బాబు తన టాలెంట్ తో.. అందంతో మరింత మంది అభిమానులను ఆకట్టుకున్నారు.. అంతేకాదు అప్పుడప్పుడు సేవా కార్యక్రమాల ద్వారా మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన రెండు ఊర్లను దత్తత తీసుకొని వారి ఆలనా పాలనా కూడా చూసుకుంటున్నారు.
నిజానికి దేశవ్యాప్తంగా ఈయన సినిమాలు విడుదల కాకపోయినా దేశవ్యాప్తంగా అభిమానులు మాత్రం ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ప్రస్తుతం అందరి హీరోల దృష్టి పాన్ ఇండియా సినిమాలపైనే ఉంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా ఒక పాన్ ఇండియా సినిమా చేయాలని అభిమానులు ఎంతగానో ఆరాటపడిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా కంటే ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు మహేష్ బాబు ఈ సినిమాలో మరింత ఫిట్‌గా కనిపించడానికి జిమ్ లో బాగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి మహేష్ బాబు తన ప్రతి సినిమాకు తన మేకోవర్ ను మార్చుకుంటూ ఉంటారనటంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే సర్కారు వారి పాట సినిమాకు అలాగే SSMB 28 చిత్రానికి మధ్య చాలా గ్యాప్ రావడంతో ఇప్పుడు తన మేకోవర్ ను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు మహేష్ బాబు.
ఈ క్రమంలోనే డంబెల్ సహాయంతో పుషప్ చేస్తూ తన బాడీని మరింత ఫిట్‌గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్ అంతా.. కమిట్మెంట్ అంటే ఇలా ఉండాలి త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ బాబు ఇంతలా కష్టపడుతున్నారు అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..