మహేశ్ బాబు సినిమాల్లో, బిజినెస్ లో సూపర్ స్టారే.!

-

మహేష్ బాబు ఇప్పుడు వున్న స్టార్ హీరో లలో మంచి ప్లానింగ్ ముందు చూపు వున్నోడు. అనేక సంస్థలకు ప్రకటనలు చేస్తూ, అలాగే చాలా రకాల బిజినెస్లు మొదలు పెడుతున్నారు. దీనికి మహేష్ భార్య అండగా ఉంటూ అన్ని పనులు చూసుకుంటోంది. తన సినిమా షెడ్యూల్స్, బిజినెస్ డీల్స్ , తన ప్రమోషన్ ఇలా అన్ని రకాల గా తనకు ఎప్పుడూ బ్యాక్ బోన్ గా వుంటూ వస్తోంది.అయితే లేటెస్ట్ వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. మహేష్ మరో బిజినెస్ ప్రారంబించ నున్నారని  తెలుస్తోంది.

మహేష్ గతంలో ‘ది హంబుల్’ అనే డిజైనర్ వేర్ ద్వారా టెక్సటైల్ బిజినెస్ లోకి దిగిన సంగతి తెలిసిందే. అలానే ఏషియన్ గ్రూప్ తో కలిసి AMB సినిమాస్ పేరిట థియేటర్స్ మల్టీప్లెక్స్ నిర్మించాడు. అలానే జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ సంస్థను ఏర్పాటు చేసి సినిమా లు నిర్మాణం చేస్తున్నారు. ఇంకా చిన్న సంస్థలు నెలకొల్పుతున్నారు.

ప్రస్తుతం మహేశ్ బాబు సన్నిహితుల నుండి వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు మహేష్ బాబు  గతంలోనే హోటల్స్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హోటల్స్ మొత్తం  వర్క్ పూర్తి అయ్యినట్లు తెలుస్తోంది. ముందుగా రెండు చోట్ల ఈ హోటల్స్ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బంజారాహిల్స్ మాంచి ఏరియా లో  ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ కి రెడీగా వుంది. ఈ హోటల్  ఏషియన్ నమ్రతా పేరుతో నిర్వహించే అవకాశం వుందట. దీని తర్వాత మిగిలిన చోట్ల కూడా మహేష్ బాబు  హోటల్స్ ప్రారంభిస్తారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఎంతైనా మహేశ్ సినిమాల్లో మరియు బిజినెస్ లో సూపర్ స్టారే అని ఆయన అభిమానులు అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version