క్లాసికల్ డాన్స్ లో ఇరగదీసిన మహేష్ బాబు కూతురు..!

-

ఘట్టమనేని సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు – నమ్రత ల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని ఇటీవల శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది. అందరినీ సితార తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ కి తీసుకెళ్ళింది. దీనిలో ఆమె తన నృత్య గురువు మహతి భిక్షు తో కలిసి శాస్త్రీయ నృత్యం చేస్తోంది. ఇక ఈ స్టార్ కుమార్తె తన పోస్ట్ కి క్యాప్షన్ తో ..” నా నృత్య గురువు @మహతి భిక్షు అక్కతో కలిసి ఈ డాన్స్ రెసిడెన్ అందించడం సంతోషంగా ఉంది . దీపావళి సందర్భంగా మేము దివ్యమైన కాంతిని జరుపుకుంటాము. తన దయ మరియు దాతృత్వంతో విశ్వాన్ని పోషించే లక్ష్మీదేవి యొక్క గొప్పదనం.. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ” అని ట్యాగ్ చేసింది సితార.

కుమార్తె పోస్టుపై తల్లి నమ్రతా శిరోద్కర్ స్పందిస్తూ .. ఆర్ మై లిటిల్ ప్రిన్సెస్.. మీరు నన్ను చాలా గర్వంగా మార్చారు” అని వ్యాఖ్యానించారు. ఇకపోతే ప్రస్తుతం సితార తన తండ్రి ఇటీవల పరశురాం దర్శకత్వంలో తెరకెక్కించిన సర్కారు వారి పాట సినిమాలో పెళ్లి సాంగులో మెరిసి అందరి మన్ననలు పొందింది ఈ ముద్దుగుమ్మ. ఇక మహేష్ బాబు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ కూడా మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో కథానాయకగా పూజ హెగ్డే నటిస్తోంది.

మహేష్ బాబు ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు . ఆ తర్వాత మరో యంగ్ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version