మార్వాడీలను వెళ్ళగొట్టాలంటూ తెలంగాణలో కొంతమంది వ్యాపారస్తులు నిరసనలు తెలుపుతున్నారు. మార్వాడిల వల్ల కొంతమంది వ్యాపారస్తులకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. దీనిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. మార్వాడీలను వెళ్ళగొట్టే హక్కు ఎవరికీ లేదని అన్నారు. మార్వాడీలు మనలో ఒకరని తేల్చి చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదని త్వరలోనే ఈ విషయం పైన స్పష్టత వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించినట్లుగా స్పష్టం చేశారు.
ఆయన మంత్రి పదవి, ఇతర విషయాలపైన చేసిన వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో అన్నారో తప్పకుండా తెలుసుకుంటామని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మహేష్ గౌడ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలను నిజంగానే వెళ్లగొడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపైన త్వరలోనే క్లారిటీ రానుంది. ఒకవేళ మార్వాడిలను కనుక వెళ్ళగొట్టినట్లయితే వారికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుందని, వారి వ్యాపారాలు దెబ్బతింటాయని మార్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.