జక్కన్న సినిమా కోసం పారితోషకం విషయంలో మహేష్ కీలక నిర్ణయం..!

-

తాజాగా మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమాను పూర్తి చేసిన తర్వాత రాజమౌళితో తన 29వ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహేష్ బాబు తన నటనతో.. రాజమౌళి దర్శకత్వ ప్రతిభతో అద్భుతమైన చిత్రాన్ని మనం ముందుకు తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా బాహుబలి సీరీస్ తో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ఇటీవల రాంచరణ్ , ఎన్టీఆర్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాతో న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు కూడా సొంతం చేసుకున్నారు.

మరొకవైపు మహేష్ బాబు తన అందం, నటనతో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న ఈయన ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతూ ఉండడంతో ప్రకటన వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ సినిమా గురించే హాట్ టాపిక్. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే సినిమాలలో నటించినందుకు యాక్టర్లకు రెమ్యునరేషన్ ఇవ్వడం మనకు తెలిసిందే. కానీ కొంతమంది అలా కాకుండా వచ్చిన కలెక్షన్ ల వాటాల వైపు మొగ్గు చూపుతుంటారు. ఇప్పటికే చాలామంది ఆ విధానాన్ని ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ బాబు కూడా ఈ ట్రెండ్ ను ఫాలో కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇదే విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి మూవీ ప్రొడక్షన్ హౌస్ ముందు ఉంచాడట మహేష్ బాబు. ఓటీటీ, వీఎఫ్ఎక్స్ సెటప్ ల ద్వారా పెద్ద హాలీవుడ్ ఆధారిత ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్టు కోసం ఆన్ బోర్డులోకి రావడానికి ఆసక్తి చూపించనుంది. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి తన ప్రొడక్షన్ హౌస్ పేరు ఓపెన్ చేయడంతో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోని ఈ సినిమాకు వచ్చే లాభాల వాటాలను బట్టి మహేష్ బాబు రెమ్యునరేషన్ తీసుకుంటారట. మరి ఈ డీల్ కుదురుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version