సెన్సార్‌ పూర్తి చేసుకున్న మేజర్‌..

-

ముంబాయి చరిత్రలో మరిచిపోలేని ఘటన తాజ్‌మహల్‌ అటాక్.. అయితే.. ముంబాయి ఉగ్రదాడుల అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘మేజర్’. అడివి శేష్ ఇందులో మేజర్ సందీప్ గా నటించాడు. ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ‘మేజర్’ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ మంజూరు చేసినట్లు.. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్ పేర్కొంది..

శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అడివి శేష్ తో పాటు సయీ మంజ్రేకర్, శోభిత దూళిపాళ, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమా నిర్మాణంలో మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్లు పాలుపంచుకున్నాయి. ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version