చాలా మంది పాస్వర్డ్స్ ని పెట్టుకునేటప్పుడు చాలా సులువైన పాస్వర్డ్స్ ని వాళ్లకి ఈజీగా ఉండాలని పెట్టుకుంటారు. అయితే చాలా మంది సులువైన పాస్వర్డ్స్ పెట్టుకోవడం వల్ల సులువుగా సమస్యలకు దారితీస్తోంది. పాస్వర్డ్ గురించి మాట్లాడుతూ … సైబర్ సెక్యూరిటీ కొన్ని విషయాలు చెప్పింది.
యూకే నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ టెక్నికల్ డైరెక్టర్ కొన్ని విషయాలు చెప్పారు. చాలామంది మర్చిపోకుండా ఉండడానికి సులువుగా పాస్వర్డ్ పెట్టుకుంటూ ఉంటారు. మేము దానిని అర్థం చేసుకోగలం. అయితే సులువైన పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల వాటిని ఎవరైనా సులువుగా ఓపెన్ చేయొచ్చు అని అంటున్నారు.
ఎప్పుడూ కూడా సెన్సిటివ్ డేటాకి ఎవరైనా గెస్ చేసే విధంగా పెట్టకూడదని అన్నారు. ఉదాహరణకు మొదటి పేరు, లోకల్ ఫుట్బాల్ టీం లేదా ఫేవరెట్ బ్రాండ్. ఇలాంటివి మీరు పెట్టుకోకుండా ఉండడం మంచిది.
ఎవరూ కూడా గెస్ చేయలేని విధంగా మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలి పాస్వర్డ్ని పెట్టుకునేటప్పుడు మీరు కాస్త క్రియేటివ్ గా ఉండడం మంచిది అని అన్నారు. అదే విధంగా మీరు గుర్తు పెట్టుకునే విధంగా కూడా ఉండాలి.
ఇక్కడ ఎక్కువగా ఉపయోగించే పాస్వర్డ్స్ ఉన్నాయి వాటిని చూడండి. ఇందులో ఉండే పాస్వర్డ్లు మీరు పెట్టుకోకుండా ఉండటం మంచిది:
123456
12345789
qwerty
111111
12345678
abc123
1234567
password1
12345