మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మలైకా బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తన నటన, అందచందాలకు ఎంతోమంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక మలైకా వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే… ఆమెకు గతంలోనే వివాహం జరిగింది. కానీ విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మలైకా అరోరా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.

రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టారు. నేను హార్డ్ కోర్ రొమాంటిక్ వ్యక్తిని. ప్రేమను ఎప్పటికీ నేను నమ్ముతాను. మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ మలైకా అన్నారు. నేటి యువత కూడా అన్ని ఆలోచించి వివాహం చేసుకోవాలి. నాకు అతి చిన్న వయసులోనే వివాహం జరిగింది. విడాకుల తర్వాత చాలా మంది నన్ను స్వార్ధపరురాలు అని నిందించారు. కానీ విడాకుల తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నానంటూ నటి మలైకా అరోరా అన్నారు. మలైకా అరోరా మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.