హరిహర వీరమల్లు సినిమాకి ఎమ్మెల్యేలు ఫ్రీగా టిక్కెట్లు పంచినా ఎవరూ వెళ్లలేదని చురకలు అంటించారు మాజీ మంత్రి రోజా. హరిహర వీరమల్లు సినిమా అట్టర్ ఫ్లాఫ్ అని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎపిసోడ్ పై తాజాగా వైసిపి మాజీ మంత్రి రోజా స్పందించారు.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఏపీలో ఎవరు అడ్డుకోలేరని రోజా తేల్చి చెప్పేశారు. రాజకీయాలు అలాగే సినిమాలను కలపొద్దని వైసీపీ నేత రోజా వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. అరచేతులు సూర్యుడిని ఎలా ఆపలేరో ఆయన సినిమాలను కూడా ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు.
సినిమాలు బాగుంటే జనం చూస్తారు అన్నారు. ఎమ్మెల్యేలు టికెట్లు కొన్నా కూడా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలు ఎవరు చూడలేదని చురకలు అంటించారు. బాగాలేని సినిమాలను ఎవరు ఆడించలేరని గుర్తు చేశారు రోజా.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాను టీడీపీ ఎమ్మెల్యే ఆపడమంటే, సూర్యుడిని అర చేతితో ఆపినట్టే
ఎన్టీఆర్ రాజకీయాల్లో లేడు.. ఆయనని విమర్శించకండి
సినిమాను, రాజకీయాలను మిక్స్ చేయకండి
సినిమా బాగుంటే ఎవరూ ఆపలేరు.. బాలేకుంటే ఎవరూ ఏం చేయలేరు
హరిహర వీరమల్లు సినిమాకి ఎమ్మెల్యేలు ఫ్రీగా టిక్కెట్లు… https://t.co/bzuzqRXhL2 pic.twitter.com/W47rXMWbvC
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2025