కేరళలో సినీ ఇండస్ట్రీ సమ్మె మొదలై కానుంది. ఈ 2025 జూన్ ఒకటి నుంచి సమ్మె చేయనుంది మాలీవుడ్. ఇందులో భాగంగా షూటింగులు బంద్ కానున్నాయి. అలాగే థియేటర్ల ప్రదర్శనలు కూడా నిలిపి వేయనున్నారు. నిరవధికంగా ఈ సమ్మె కొనసాగనుంది అని సమ్మెను ప్రకటించిన ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ తెలిపింది.
మాలీవుడ్ సినిమాలు దేశ వ్యాప్తంగా హిట్ అవుతుండటంతో బడ్జెట్లు పెరిగాయి. అలాగే సక్సెస్ శాతం అనేది తగ్గింది. కానీ నటీనటులతో పాటు టెక్నీషియన్ లు కూడా పారితోషికం భారీగా పెంచేశారు. అందువల్ల నిర్మాతల మీద భారం అనేది పెరుగుతూ వస్తుంది. కాబట్టి వీటన్నిటినీ పరిష్కరించుకోవడానికే ఈ సమ్మె అనేది చేయనున్నారు. అయితే ఈ సమ్మె ప్రభావం అనేది మిగిలిన ఇండస్డ్రీల మీద కూడా పడనుంది. జూన్ నుంచి రిలీజ్ అయ్యే మలయాళ వెర్షన్ సినిమాల పరిస్థితి గందరగోళంగా మారింది అనే చెప్పాలి. మరి జూన్ లోపు ఈ సమస్యను మాలీవుడ్ పేదలు పరిష్కరిస్తారా లేదా అనేది చూడాలి.