కులగణనలో వివరాలు నమోదు చేసుకోని వారి కోసం రేపటి నుండి 28వ తేదీ వరకు రీ సర్వే చేయనున్నారు. GHMC ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ 040-21111111 ఏర్పాటు చేసారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కాల్ సెంటర్ పని చేయనుంది. ఇప్పటి వరకు కుల గణన లో నమోదు కాని కుటుంబ సభ్యులు మాత్రమే కాల్ సెంటర్ కు కాల్ చేసి వారి పూర్తి వివరాలు ఇవ్వాలి. ఆధార్ నంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్ తో పాటుగా పోస్టల్ పిన్ కోడ్ నెంబర్ ను తెలియజేయాల్సి ఉంటుంది.
కాల్ చేసిన వాళ్ళు ఇచ్చే అడ్రస్ ప్రకారం వారి ఇంటికి వెళ్లి కులగణన చేయనున్నారు ఎన్యుమరేటర్లు. మొబైల్ నెంబర్ తో సెర్చ్ చేసి సంబంధిత వ్యక్తి పాత డేటా బేస్ లో నమోదు అయ్యారా లేదా వివరాలు పరిశీలించనున్నారు అధికారులు. GHMC తో పాటు ఇతర జిల్లాల నుండి వచ్చిన కాల్స్ కూడా స్వీకరించి, ఆ వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఫార్వర్డ్ చేయనున్నారు అధికారులు.