ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్ గిరి ఏసీపీ నర్సింహారెడ్డి అరెస్ట్ అయ్యారు. సుమారు రూ.70 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. ఈరోజు ఉదయం నుండి 25 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి, సైబర్ టవర్స్ ఎదురుగా 1,960 గజాల భూమి, మరో 4 ప్లాట్లు, హఫీజ్ పేట్ లో మూడంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ తో పాటు అక్కడే రెండు ఇండిపెండెంట్ ఇళ్లు గుర్తించగా రూ 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అలానే రెండు బ్యాంక్ లాకర్లని గుర్తించారు. లాకర్లు ఓపెన్ చేస్తే ఏసీపీ అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ మరియు ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ పత్రాలను స్వాధీనం చేసుకున్నది. అలానే ఈరోజుకు సోదాలు ముగిసినట్టు చేబుతోన్నా కొన్ని చోట్ల ఇంకా సోదాలు కొనసాగుతున్నట్టు చెబుతున్నారు.