రేవంత్ పెద్ద బ్లాక్ మెయిలర్..సవాల్ చేస్తే తస్సు మన్నాడు : మల్లారెడ్డి

-

రేవంత్‌ రెడ్డికి మంత్రి మల్లా రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. నిన్న రేవంత్ ప్రెస్ మీట్ చూసానని.. కానీ తన సవాల్ కు స్పందించకుండా  రేవంత్ తుస్సు మన్నడని ఎద్దేవా చేశారు. రేవంత్‌ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్ అని మండిపడ్డారు.  మంచి సవాలు విసిరితే తీసుకోలేదని… రేవంత్ అబద్ధం ఆడితే…అతికేటట్లు ఉండాలని ఫైర్‌ అయ్యారు. ఏవో పేపర్లు చూపి డ్యామేజ్ చేస్తే అయిపోతుందా ? జవహర్ నగర్ లో గవర్న మెంట్ స్థలంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నారని తెలిపారు. ఇల్లు కట్టుకున్నారు…కానీ సౌకర్యాలు లేవన్నారు.

కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 330 ఎకరాల్లో జీవో తీసి ఇచ్చారని…పేద ప్రజల కోసం..కట్టిన ఇళ్లకు క్రమబద్ధీకరణ చేశారని పేర్కొన్నారు. జవహర్ నగర్ లో నా కోడలు పేరు మీద 350 గజాల స్థలం ఉందని…దానికి ట్యాక్స్ కడుతున్నామన్నారు. దానికి NOC ఉంది…సేల్ డిడ్ ఉందని వివరించారు. మాకు రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పిన మల్లారెడ్డి…. నేను ఎంపీ అయినప్పటి నుంచి రేవంత్‌ చిత్ర హింసలు పెడుతున్నాడని మండిపడ్డారు. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని… ఈ విషయాన్ని గతంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. తాను అమాయకుడినని… రేవంత్ ఓవర్ స్మార్ట్ అని మల్లారెడ్డి తెలిపారు. అందరికి టైమ్ వస్తుందని… ఎక్కువ రోజులు నడవదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version