సీఎం కెసిఆర్ కు… గజ్వేల్ లో షర్మిల దీక్ష

-

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు వైయస్సార్టిపి అధినేత వైయస్ షర్మిల దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఈనెల 31వ తేదీన సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ కు వెళ్లనున్నారు వైయస్ షర్మిల. ఈ సందర్భంగా గజ్వేల్ టౌన్ లో వైయస్ షర్మిల ఉద్యోగ దీక్ష చేపట్టనున్నారు.

గజ్వేల్ నియోజకవర్గం లోని అనంత రావు పల్లి లో ఆత్మహత్య చేసుకున్న కొప్పు రాజు అనే యువకుడి కుటుంబాన్ని వైయస్ షర్మిల పరామర్శించనున్నారు. అనంతరం గజ్వేల్ టౌన్ లో ఒక రోజు మొత్తం ఉద్యోగ దీక్ష చేపట్టనున్నారు వైయస్ షర్మిల. మీ ఉద్యోగ దీక్ష కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు వైయస్సార్ షర్మిల అనుచరులు. కాగా ఇప్పటికే వైయస్ షర్మిల… కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా లో దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా.. ప్రతి మంగళ వారం వైయస్ షర్మిల.. ఉద్యోగ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version