వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ రోజు పార్లమెంట్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే అధికార ప్రభుత్వంపై విమర్శల వెదజల్లును కురిపించారు. కాగా రాజ్యసభలో మాట్లాడిన మల్లిఖార్జున ఖర్గే మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో మాట్లాడిన విధంగానే .. రాజ్యసభలోనూ చర్చను జరపాలని డిమాండ్ చేశారు ఖర్గే. ఇంకా ఖర్గే మాట్లాడుతూ ప్రధాని మోదీ ఖచ్చితంగా రాజ్యసభకు హాజరయ్యి మణిపూర్ అంశం మీద చర్చను జరిపించాలని దుయ్యబట్టారు. కాగా ఈ వ్యాఖ్యలపైన బీజేపీ ఎంపీలు సభలో హోరున ఖర్గే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నినాదాలకు ఖర్గే ఏమి.. ప్రధాని మోదీ రాజ్యసభకు రావడానికి సమస్య ఏమిటి ? మోదీ ఏమైనా దేవుడా అంటూ ఖర్గే అధికార పక్ష ఎంపీలపై విమర్శలను గుప్పించారు.