హోం మంత్రిగా పవన్‌ కళ్యాణ్‌… అనిత రియాక్షన్‌ ఇదే !

-

హోం మంత్రి పదవిపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై… అనిత రియాక్ఠ్‌ అయ్యారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన హోం మంత్రి అనిత..హోం మంత్రి గా ఫెయిల్ అయ్యానని పవన్ కళ్యాణ్ ఎక్కడా అనలేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను నేను పాజిటివ్ గా తీసుకుంటున్నానని వివరించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయనతో మాట్లాడి క్లారిటీ తీసుకున్నానని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కట్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

anitha on pawan kalyan

సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు వస్తున్నాయని… భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అసభ్య మెసేజ్ లు పెడుతున్నారని ఆగ్రహించారు. పవన్ కళ్యాణ్ కూతుళ్లు, నారా బ్రాహ్మణి, భువనేశ్వరిలపై అనుచిత పోస్టింగ్స్ పెడుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆవేదనతోనే పవన్ కళ్యాణ్ అలా మాట్లాడారని… నేటికీ నేను సోషల్ మీడియా బాధితురాలినే అంటూ వ్యాఖ్యానించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై జిల్లాల వారీగా సమీక్ష చేస్తున్నామని.. పోలీసు శాఖ నిర్లిప్తత నుంచి బయటకు రావాలని కోరారు. గంజాయి మత్తులో ఉన్న వారు పోలీసులపై ఛాలెంజ్ చేసి వెళ్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version