ఎంత చెప్పినా వినకుంటే రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదు అన్నారు మల్లు రవి. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పీసీసీ చీఫ్ చర్చించారని పేర్కొన్నారు. వాటిని నేను పరిశీలిస్తున్నాను.. నాది మంటలు ఆర్పే పని.. మంటలు పెట్టే పని కాదన్నారు మల్లు రవి.

కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సరి చేస్తూ, అందరు కలిసి పని చేసేలా చూసే బాధ్యత నాది… వరంగల్ జిల్లా నేతల మధ్య పంచాయితీపై కూడా నలుగురు సభ్యులతో కమిటీని పార్టీ నియమిస్తుందని వెల్లడించారు. రెండు గ్రూపులను కూర్చొబెట్టి కమిటీ మాట్లాడుతుందని చెప్పారు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి.