వానకాలం చల్లని వాతావరణాన్ని అందిస్తుంది పచ్చని చెట్లుతో ప్రకృతి ఎంతో అందం గా వుంటుంది. అదే సమయంలో బ్యాక్టీరియా, ఫంగస్, క్రిములు వ్యాప్తికి అనుకూలమైనది. ఎక్కువ తేమ ఉండడం వలన బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇక పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది మరి ఈ సీజన్లో వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం కొన్ని కూరగాయలు వర్షాకాలంలో తినడం వల్ల జీర్ణ సమస్యలు ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. మరి పిల్లలకు వర్షాకాలంలో నిషేదించాల్సిన కూరగాయల గురించి తెలుసుకుందాం..
ఆకుకూరలు: వానాకాలంలో ఆకుకూరలైన పాలకూర, బచ్చలి వంటివి తినడం మానుకోవడం మంచిది. ఈ కూరలు తేమ వాతావరణంలో సులభంగా బ్యాక్టీరియా, ఫంగస్ ను ఆకర్షిస్తాయి. ఇవి పిల్లల్లో కడుపునొప్పి విరోచనాలు, జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. అధిక తేమ వలన కూరలపై సూక్ష్మజీవులు త్వరగా పెరుగుతాయి, పచ్చిగా తినే సలాడ్ లో వీటిని ఉపయోగిస్తే క్రిములు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ కూరను సరిగ్గా కడిగి, ఉడికించి తినడం ముఖ్యం.
క్యాలీఫ్లవర్,బ్రోకలీ : ఈ కూరగాయలు అధిక పోషకాలను కలిగి ఉంటాయి. కానీ వానాకాలంలో వీటిని తినడం కొంత ప్రమాదకరం. ఈ కూరలు తేమను సులభంగా గ్రహిస్తాయి దీని వలన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కూరలు తడిగా ఉన్నప్పుడు సులభంగా కుళ్ళిపోతాయి. సరిగా శుభ్రం చేయకపోయినా జీర్ణ సమస్యలు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ముఖ్యంగా పిల్లల లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. తద్వారా ఇలాంటి కూరలు ఆహారంలో చేర్చే ముందు శుభ్రం చేసి ఆవిరిలో ఉడికించి ఆ తర్వాతే పెట్టాలి పచ్చిగా పిల్లలకు పెట్టకూడదు.

పుట్టగొడుగులు(మష్రూమ్స్): పుట్టగొడుగులు వానాకాలంలో నిషేధించడం మంచిది. ఇవి పిల్లలకు జీర్ణం కావడం కష్టం మార్కెట్లో లభించే పుట్టగొడుగులు తరచూ తాజాగా ఉండకపోవచ్చు. ఇది ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి.
జాగ్రత్తలు: కూరగాయలు ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటిలో కడిగి పూర్తిగా ఉడికించాలి. తాజా కూరగాయలను మాత్రమే ఎంచుకోవాలి. ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయకండి. వానకాలంలో బయటి ఆహారం, స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉంచండి. ఇంట్లో తయారు చేసిన వేడివేడి ఆహారాన్ని పిల్లలకు అందించండి. రోగ నిరోధక శక్తి పెంచే నిమ్మకాయ, బత్తాయి, జామ వంటి పండ్లను ఆహారంలో చేర్చండి. పిల్లల ఆహారంలో పోషకాలు సమానంగా ఉండేలా చూసుకోండి.
(గమనిక:ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, పిల్లలకు ఆహారం మార్పిడి చేసే ముందు ఆరోగ్య సమస్యల విషయంలో వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.)