జగన్నాధ రథయాత్ర ఉత్సవాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం కోల్‌కతాలోని ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో మమతా బెనర్జీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పూరి జగన్నాధ రథయాత్ర ఆదివారం ప్రారంభమైంది. 1971 నుంచి జరుగుతున్న ఈ రథయాత్రను ఈసారి అత్యంత వైభవంగా రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది తరలివచ్చిన ఈ యాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పాల్గొననున్నారు.మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలోని ఒడిషా ప్రభుత్వం జగన్నాధ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. లక్షలాది మంది భక్తులు రధయాత్ర సందర్భంగా పూరి చేరుకోవడంతో పెద్దసంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పూరీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. దేశంలో పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగిస్తారు.