హైదరాబాద్ లో మరో దారుణం..భార్యను మర్డర్ చేసి కరోనాపై నెట్టిన భర్త..

-

హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి కరోనా తో మృతి చెందినట్టు చిత్రీకరించాడు భర్త.. ఎవరికి అనుమానం రాకూడదనే నేపథ్యంలో భార్య మృత దేహానికి అంత్యక్రియలు చేయించాడు భర్త. అంతా బాగానే ఉందనుకునే తరుణంలో.. భర్త ప్రవర్తనపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అనుమానం రావడంతోనే.. తమ కూతురు కరోనా తో మృతి చెందలేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కవిత తల్లిదండ్రులు.

ఆ ఫిర్యాదు మేరకు.. కవిత మృతదేహానికి రి-పోస్టుమార్టం చేశారు పోలీసులు. దాంతో కవిత కరోనా తో చనిపోలేదని పోస్టుమార్టం చేసిన వైద్యులు తేల్చేశారు. కవిత ను హత్య చేసి గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు చేశాడు భర్త విజయ్. నిజాలు బయట పడటం తో.. కరోనా పేరు చెప్పి భార్యను చంపిన విజయ్ ని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. అసలు తన భార్యను ఎందుకు చంపడాని తెలుసుకునే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version