TV ACTOR : మైనర్ బాలికపై వేధింపులు…ప్రముఖ నటుడు అరెస్ట్

-

మనదేశంలో మహిళలకు అసలు భద్రత లేకుండానే పోయింది. ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు, చట్టాలు అమలు చేసినప్పటికీ.. పిల్లలపై లైంగిక దాడులు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా మైనర్ బాలికను లైంగికంగా వేధించాడని ఆరోపణలతో ప్రచీన్ చౌహాన్ అనే బుల్లితెర నటున్ని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం పలు సెక్షన్లను చౌహాన్ పై పెట్టి కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు.

ఈ కేసుతో మరోసారి సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. అయితే ఈ కేసు కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇక ప్రచీన్ చౌహాన్… పలు టెలివిజన్ షో లతో హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. 42 సంవత్సరాల ఈ నటుడు ఇటీవల ప్యార్ కా పంచ్ అనే వెబ్ సిరీస్ లో కనిపించి.. అందరినీ కనువిందు చేశాడు.

ఇక అంతకు ముందు కూడా ఇలాగే టీవీ నటుడు పెర్ల్ వీ పూరి తన టీవీ షో సైట్స్ లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి వేధించాడని ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతడు బెయిల్ పై రిలీజ్ అయిన విషయం కూడా తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version